ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్టిడిపి నేత జలీల్ అహ్మద్ చొరవతో రవినగర్ లో తీరనున్న కరెంట్ కష్టాలు

టిడిపి నేత జలీల్ అహ్మద్ చొరవతో రవినగర్ లో తీరనున్న కరెంట్ కష్టాలు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 9*

కోట మండలం రవినగర్ ప్రాంతంలో చాలా రోజుల నుండి విద్యుత్ లోవోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న టిడిపి జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ సమస్యను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలియజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అదేశాల మేరకు జలీల్ అహ్మద్ చొరవతో రవినగర్ నందు నూతన 100 కేవి ట్రాన్స్ఫారం ఏర్పాటుకు విద్యుత్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ సందర్భంగా రవి నగర్,జయరాం నగర్ ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎన్నో రోజుల నుండి కరెంటు లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని,సమస్యను తెలిపిన వెంటనే ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు తెలియజేసి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేసిన షేక్ జలీల్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంల టిడిపి కోట మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు,లైన్మెన్ కరిముల్లా టిడిపి నాయకులు,స్థానికులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular