ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్మదర్ థెరీసా జాతీయ సేవా అవార్డ్ అందుకున్న సీనియర్ జర్నలిస్టు పాశం ఏడుకొండలు

మదర్ థెరీసా జాతీయ సేవా అవార్డ్ అందుకున్న సీనియర్ జర్నలిస్టు పాశం ఏడుకొండలు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 9

నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందిన పాశం ఏడుకొండలు 38 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పాత్రికేయ రంగంలో కొన సాగడమంటే కత్తి మీద స్వాము లాంటిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన మదర్ తెరిస్సా జాతీయ సేవా అవార్డుల ప్రధానం కార్యక్రమంలో పాశం ఏడుకొండలు మదర్ థెరీసా జాతీయ సేవా – 2026 అవార్డును అందుకున్నారు. గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి అంజనీ కుమారి హైకోర్టు  సూపరిండెంట్ (హైదరాబాద్),బెంగుళూరు ఇన్ఫోటెక్ సీఈవో ఎ కేశవులు,రాధా హెచ్ ఆర్ స్టేట్ మెంబర్,వాసవి క్లబ్ మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి,ఎం నాగిరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పాశం ఏడుకొండలు మాట్లాడుతూ గొప్ప సంఘ సేవకురాలు పేరు మీదుగా అవార్డ్ అందుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు.అవార్డ్ అందించిన మార్కాపురం గ్లోబల్ ఫౌండేషన్ అధినేత గొట్టిముక్కల చెన్నకేశవులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular