శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానం
మండలాన్నీ ఆ ఇద్దరు నాయకులు తినేశారు – పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి
స్వర్ణసాగరం వాకాడు
మండల పరిధిలోని మొలగనూరు మాజీ సర్పంచ్ సుగుణమ్మ, వారి అనుచర వర్గం ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వారితో పాటు ఉప సర్పంచ్ చెంచు కృష్ణయ్య వారి అనుచర వర్గం దాదాపు 100 కుటుంబాలకు పైగా పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో సుగుణమ్మ పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేశారని తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల పార్టీని వీడడం జరిగిందని నేడు తెలుగుదేశం పార్టీ లో చేరడం చాలా సంతోషంగా ఉందని ఈ నేపథ్యంలో బాలిరెడ్డి పాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ కైవసం చేసుకుంటామని కంఠాపదంగా తెలిపారు. అనంతరం పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ గతంలో సుగుణమ్మ వారి అనుచర వర్గం టిడిపి పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని వాకాడు మండలంలో అధికార పెత్తనం అంటూ ఆ ఇద్దరు నాయకులు మండలం మొత్తాన్ని అభివృద్ధి పేరుతో తినేశారు. వాకాడు మండల ప్రజలు కనువిప్పు కలిగి ఆ నాయకులకు స్వస్తి చెప్పాలని ఆయన కోరుతున్నట్లు తెలిపారు.


