*కోటి 93 లక్షలతో ఆరు నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి – ఏ డి మల్లిఖార్జున్ రావు
*స్వర్ణసాగరం వాకాడు*
వాకాడు మండల పరిధిలోని బాల్రెడ్డిపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు నూతన భవనం కోసం ఏడి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 93 లక్షలతో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని సుమారు ఆరునెల వ్యవధిలో పూర్తి చేస్తామని గతంలో బేస్మెంట్ జరిగిన ప్రాంతంలోనే నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మురళి రెడ్డి, శ్రీనివాసరెడ్డి,గోపి నాయుడు,వైద్యాధికారులు, నాయకులు పాల్గొన్నారు.


