
స్వర్ణసాగరం -తొట్టంబేడు,
వినాయక చవితి పండుగ సందర్భంగా తొట్టంబేడు మండలంలోని ఇలగునూరు, రౌతుసూరమాల పంచాయతీల పరిధిలోని ఎస్టీ కాలనీ వాసులకు గాలి బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు ఆధ్వర్యంలో గాలి మురళి నాయుడు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా గాలి మురళి నాయుడు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా పండుగలు, పర్వదినాల్లో నిరుపేద కుటుంబాలకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇలగునూరు మాజీ సర్పంచ్ మధునాయుడు, లక్ష్మయ్య, శివ, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు.


