ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...సంపత్ కుమార్ రెడ్డి

పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…సంపత్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 12

పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్సిపి కోట మండలం అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కోట మండలం కోట క్రాస్ రోడ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోట మండల వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ కేకును కట్ చేసి వైయస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈసందర్భంగా పలగాటి సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికై వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు.రానున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కోట మండలం నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి,దేవారెడ్డి నాగూర్ రెడ్డి,శశి రెడ్డి,వెంకురెడ్డి,షనీల్ రెడ్డి,కోట మండలం మహిళా అధ్యక్షురాలు ఎస్.కె రేష్మ,సుధా రెడ్డి,పాముల సురేంద్ర,పల్లెమల్లు విజయసాయిరెడ్డి,కనుపూరు జగదీష్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular