ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అల్లారెడ్డి ఉన్నత పాఠశాల అంతర్జాతీయ స్థాయికి
కోట స్వర్ణసాగరం మార్చి 14
పుట్టిన గడ్డ,చదివిన బడిని మర్చిపోకుండా రుణం తీర్చుకునే దిశగా టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ అడుగులు వేస్తున్నారు.కోట మండలం కోటలోని ఏవి కేఆర్ ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం టిడిపి నేత జలీల్ అహ్మద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కరుణాకర్ రెడ్డి,ఎంఈఓ దారా మస్తానయ్య లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండలం మండల కేంద్రంలోని 79 సంవత్సరాల చరిత్ర ఉన్న అల్లా రెడ్డి వెంకట కృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని అన్నారు.రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్రంలో విద్య అభివృద్ధి కొరకు విప్లవాత్మక మార్పులు చేపట్టారని అన్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించి పేద ప్రజలకు అంతర్జాతీయ స్థాయి విద్యను కల్పించాలని సంకల్పించారని అన్నారు.అందులో భాగంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నియోజకవర్గంలోని మెట్టు,చిట్టేడు, కోట ఉన్నత పాఠశాలలలో ఒక దానిని ఎంపిక చేయాలని నిర్ణయించారని అన్నారు.అయితే మండల కేంద్రమైన కోట,కోట,వాకాడు, చిట్టమూరు చిల్లకూరు గూడూరు మండల కేంద్రాలకు మధ్యలో ఉండటం తీర ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్య అందకపోవడం వంటి కారణాల దృష్ట్యా అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలను ఎంపిక చేయవలసిందిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను అభ్యర్థించడం జరిగిందని అన్నారు.వెంటనే స్పందించిన పాశిం సునీల్ కుమార్ పేద విద్యార్థుల దృష్ట్యా దీనికి ఆమోదం తెలిపారని అన్నారు.ఈ పాఠశాలలో విశాలమైన ఆట స్థలం,ఇండోర్ స్టేడియం,లైబ్రరీ,డిజిటల్ క్లాసులు వంటి అన్ని హంగులు ఉండడంతో అంతర్జాతీయ స్థాయి విద్యా బోధన జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు.ఉన్నత పాఠశాలతో పాటు ప్లస్ టు తరగతులలో 126 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు,350 మంది హై స్కూల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పాఠశాల వస్తే ఇక్కడ విద్యార్థుల సంఖ్య 1500 దాటి అవకాశం మెండుగా ఉందన్నారు.జాతీయస్థాయి పోటీ పరీక్షలు అయినా ఐఐటి,నీట్ వంటి పోటీ పరీక్షలలో అత్యధిక స్థాయి విద్యార్థులు ఈ పాఠశాల నుండే భవిష్యత్తులో ఎంపిక కాబోతున్నారన్నారు.ఈ అంతర్జాతీయ పాఠశాల త్వరలోనే ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుందని తద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాల వేదిక కాబోతుందని అన్నారు.ఈ పాఠశాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఎంఈఓ మస్తానయ్య,హెచ్ఎం కరుణాకర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నామని అన్నారు.నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నా అట్టడుగు స్థాయి నుండి వచ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తనకు రాజకీయ బిక్ష పెట్టిన కోటను ఆదరించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.పాశిం సునీల్ కుమార్ నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.పుట్టిన గడ్డ,చదివిన పాఠశాల అభివృద్ధి కోసం ఇంతటి మమకారాన్ని చూపుతున్న షేక్ జలీల్ అహ్మద్ ను కోట ప్రజలు అభినందిస్తున్నారు.ఈ మీడియా సమావేశంలో ఎంఈఓ దారా మస్తానయ్య,హెడ్మాస్టర్ కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు షేక్ శంషుద్దీన్,దారా సురేష్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, నౌషాద్,పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



