కోట స్వర్ణసాగరం మార్చి 15
బహుజన జాతి కోసం నీతిగా నిలబడిన త్యాగం కాన్సీరాం,కాలం కన్నటువంటి విప్లవం కాన్షిరాం అని న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లే పేర్కొన్నారు.కోట మండలం కోటలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మాన్యశ్రీ కాన్సీరాం జయంతి వేడుకలలో న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్ కాంబ్లె మాట్లాడుతూ అన్ని అధికారాల కన్నా రాజకీయ అధికారమే పెద్ద అధికారమని ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చాకిరీ చేస్తున్నటువంటి అనుగారిన వర్గాలు సింహాసనం ఎక్కాలనే అంబేద్కర్ సిద్ధాంతం వైపుగా మాన్య శ్రీ కాన్సీరాం అడుగులు వేశారని అన్నారు.లోక కళ్యాణం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మాన్యశ్రీ కాన్సీరాం జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఆకలి అవమానాన్ని భరించిన బహుజన ప్రజలు కాన్సిరాం జీవితాన్ని గుర్తుతెచ్చుకొని బహుజన సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.దళితుల అభివృద్ధికి కాన్షీరాం ఎనలేని కృషిచేశారని,దేశంలో అంబేద్కర్‌కు నిజమైన వారసుడు కాన్షీరామేనని అన్నారు. ఓటు ద్వారా సమాజంలో మార్పు,అధికారం సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు.ఆయన బాటలో నడిస్తేనే దళితుల బతుకులు మారుతాయని,ఆ దిశగా బహుజనులు అందరూ పయనించాలని పిలుపునిచ్చారు.



