ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్బహుజన యువత మేలుకో బానిసత్వాన్ని వీడి బహుజన సమాజాన్ని నిర్మించు...శ్రీరాం శివప్రసాద్

బహుజన యువత మేలుకో బానిసత్వాన్ని వీడి బహుజన సమాజాన్ని నిర్మించు…శ్రీరాం శివప్రసాద్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 15

బహుజన యువత మేలుకొని బానిసత్వాన్ని పూర్తిగా వీడి బహుజన సమాజాన్ని నిర్మించుకునేందుకు యువత అందరూ కృషి చేయాలని అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్  శ్రీరాం శివప్రసాద్ పేర్కొన్నారు.ఆదివారం కోట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మాన్యశ్రీ కాన్సిరాం జయంతి వేడుకలలో శివ శంకర్ బహుజన యువతకు మంచి సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో శివ ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు ఇచ్చిన హక్కులను ఆయుధాలుగా చేసుకుని బహుజన సమాజ స్థాపన కోసం యువత ముందుకు సాగాలని అన్నారు.బానిసత్వాన్ని వీడి అగ్రకులాల వారికి ఎట్టి చాకిరి చేయడం మాని మనకున్న హక్కులతో గొప్ప రాజ్యాధికారాన్ని మనమే సృష్టించుకోవాలని అన్నారు.బహుజనులు తమ ఓటును అమ్ముకోకుండా ఎన్నికలలో ఇతర రాజకీయ పార్టీల వారికి ఊడిగం చేయడం మాని బానిసత్వాన్ని వదిలి బహుజనులే పోటీ తత్వం అలమరుచుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని యువతకు మార్గదర్శకాలు తెలిపారు.ఓటును మందు,బిర్యానీ ప్యాకెట్లకు అమ్మకాలు పెడితే మన జీవితాలను మనమే అమ్ముకున్నట్లని అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా శివ ప్రసాద్ యువతకు సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular