కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 13
కోట మండలం కోటలోని ఆకుతోట వీధిలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు కిరణ్ తండ్రి గూడూరు రాజయ్య ఆదివారం స్వర్గస్తులయ్యారు.ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ సోమవారం రాజయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ నేత జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఎంతో మంచివారు,మృదుస్వభావి,మంచి మనసున్న వ్యక్తి గూడూరు రాజయ్య ఆకస్మిక మరణం చాలా బాధాకరం అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,తమకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడద్దని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు.జలీల్ అహ్మద్ వెంట ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్,శంషుద్దీన్,మండలం ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు,మైనార్టీ నాయకులు నౌసాద్ బాష తదితరులు ఉన్నారు.



