ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్మెరిసిన చిన్నారి ఖ్యాతి జాన్విహా:అరుదైన ప్రతిభకు దక్కిన ప్రథమ బహుమతి

మెరిసిన చిన్నారి ఖ్యాతి జాన్విహా:అరుదైన ప్రతిభకు దక్కిన ప్రథమ బహుమతి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 11

కోట మండలం విద్యానగర్‌లోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గ్రాడ్యువేషన్ డే వేడుకలతో సందడిగా మారింది.విద్యార్థుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలిచింది. ఎల్‌కేజీ చదువుతున్న చిరుత ప్రాయపు చిన్నారి పాముల ఖ్యాతి జాన్విహా కేవలం ఆటపాటల్లోనే కాకుండా చదువులో, తెలివితేటల్లో తన వయసును మించిన పరిణతిని కనబరుస్తూ ఈ చిన్నారి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖులు డాక్టర్ ఎస్.కె.జిలాని భాష మరియు పాఠశాల కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ఖ్యాతి జాన్విహా ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోవడం విశేషం.వేదికపై అతిథుల నుంచి బహుమతి అందుకుంటున్న సమయంలో ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ,ఇంత చిన్న వయసులోనే చదువు పట్ల ఇంతటి ఆసక్తి,అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండటం అభినందనీయమని కొనియాడారు.కేవలం విద్యా విషయాల్లోనే కాకుండా ప్రతి పనిలోనూ ఎంతో చురుగ్గా ఉంటూ అందరినీ మురిపిస్తున్న ఈ చిన్నారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు,పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పెద్దలు మనసారా ఆశీర్వదించారు.అటు ఉపాధ్యాయులు,ఇటు తల్లిదండ్రులు చిన్నారి జాన్విహా సాధించిన ఈ విజయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular