ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్మానవత్వానికి ప్రతీక శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి

మానవత్వానికి ప్రతీక శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 18

మానవత్వానికి ప్రతీకగా,నిరుపేదలకు అండగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి నిలుస్తుంది.ఈ నేపద్యంలోనే శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరుకి చెందిన దువ్వూరు నగేష్ రెడ్డి దాతృత్యంతో వల్లమురి నిర్మలమ్మ అనే నిరుపేద మహిళకు జీవనాధారం నిమిత్తం 11వేల రూపాయలు విలువచేసే కుట్టు మిషన్ ను బుధవారం ఆమెకు అందించారు.ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ నెల్లూరు హరినాధపురంకు చెందిన వల్లమురి నిర్మలమ్మ తన ధీన పరిస్థితిని తమకు తెలియజేసిందని అందులోనూ ఆమెకు వికలాంగురాలైన కుమార్తె కూడా ఉందని,ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు దువ్వూరు నగేష్ రెడ్డికి తెలపగా వెంటనే స్పందించిన ఆయన సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య ద్వారా 11 వేల రూపాయలు విలువచేసే కుట్టు మిషన్ ను ఆమెకు అందించారన్నారు. ఈ సందర్భంగా వల్లమురి నిర్మలమ్మ వారి కుటుంబ సభ్యులు,దాత దువ్వూరు నగేష్ రెడ్డికి,శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular