కోట స్వర్ణసాగరం మార్చి 16
చిల్లకూరు మండలంలోని జ్యోతి వే బ్రిడ్జి వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది వైసీపీ నాయకులను కార్యకర్తలను సోమవారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలోకి వారికి పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తిమ్మనగారిపాలెం సర్పంచ్ గిద్దలూరు సుమలత, కమ్మవారిపాలెం సర్పంచ్ చిట్టెటి నారాయణ, యెరూరు ఎంపీటీసీ చేవూరు మాధవి మరియి మాజీ ఎంపీటీసీ చేవూరు నాగరాజు లను వారితో పాటుగా 400 మందికి టీడీపీ నాయకుడు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు.పార్టీలో చేరే వారు పాత నాయకులతో సమన్వయము చేసుకుని ముందుకెళ్లాలని అన్నారు.పార్టీ లో అందరికీ సమూచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అందరూ కలసి పనిచేసి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చిల్లకూరు గూడూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



