ePaper
Monday, April 20, 2026
Homeఎడిటోరియల్టీడీపీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి దాతృత్వంతో చలివేంద్రం ఏర్పాటు

టీడీపీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి దాతృత్వంతో చలివేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 5

కోట మండలం తిన్నెలపూడి గ్రామ పంచాయతీలోని తిన్నెలపూడి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి దాతృత్యంతో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గండవరం సుష్మా రెడ్డి మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని,ప్రజల దాహార్తి తీర్చడం కోసమే చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో వయసు పెరిగిన పెద్దవాళ్లు,చిన్న పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉండాలని ఎండ తీవ్రతను,వడదెబ్బలను తప్పించుకోవడానికి చల్లని పానీయాలు సేవించడం,మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ప్రజలకు ఆమె సూచనలు ఇచ్చారు.గ్రామంలో ఎవరికీ ఏ ఆపద వచ్చిన సమస్యలు ఉన్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చే నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి అని తండ్రికి తగ్గ తనయిగా పేరు తెచ్చుకుంటూ,అనేక అభివృద్ధి పనులు గ్రామంలో చేసారని,ఈ సందర్భంగా తిన్నెలపూడి గ్రామ ప్రజలు సుష్మా రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular