వాకాడు ఏ.బి.సి.సి యువత ఆధ్వర్యంలో నిర్వహణ
గజమాల వేసి సత్కరించిన యువత
జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు
స్వర్ణసాగరం వాకాడు ఏప్రిల్ 14
అణగారినవర్గాలఅభ్యున్నతికీఅహర్నిశలు కృషి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జన్మదినం సందర్బంగా వాకాడు హరిజనవాడ కేంద్రలోని ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద వాకాడు ఏ. బి.సి.సి యువత ఆధ్వర్యంలో గజమాలవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ నేడు అగ్రవర్ణాలకు సరిపోటిగా జీవిస్తున్నామంటే అది ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కృషికి నిదర్శనమని ఆయన రచించిన రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు సమానత్వం ఉండే విధంగా చేసిన ఆ మహానుభావుడి జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అయన మన్మధ్యన లేకపోయినా అయన చేసిన సేవలు చిరస్మరనీయమని వారు కొనియాడారు అనంతరం బారికేకును కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు.ఈ కార్యక్రమం లో అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యువత గ్రామస్తులు చిన్నపిల్లలు పాల్గొన్నారు.



