ePaper
Sunday, April 19, 2026
Homeఎడిటోరియల్ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో కోట ఏ.వి.కే.ఆర్ జడ్పీ హైస్కూల్ ప్లస్ విద్యార్థినీల ప్రభంజనం

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో కోట ఏ.వి.కే.ఆర్ జడ్పీ హైస్కూల్ ప్లస్ విద్యార్థినీల ప్రభంజనం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 15

కోట మండలం కోటలోని ఏ.వీ.కే.ఆర్ జడ్పీ హైస్కూల్ ప్లస్ విద్యార్థినీలు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో నందిపాక మహిత 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.మల్లి శ్రావణి 979,మానికల వాణి 829,మార్కులు సాధించడం జరిగింది.సీనియర్ ఇంటర్ ఎంపీసీలో పి.జాహ్నవి 881,పి.సుస్రిత 879,  కె.నక్షత్ర 874,మార్కులు సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డి.కరుణాకర్ రెడ్డి తెలిపారు.అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు 23 మందికి గాను 13 మంది, సీనియర్ ఇంటర్ బైపీసీలో 28 మందికి గాను 18 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 25 మంది విద్యార్థులకు పదిమంది, జూనియర్ బైపిసి లో 38 మందికి గాను 20 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు.ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి,లెక్చరర్లు విద్యార్థినీలను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular