ePaper
Sunday, April 19, 2026
Homeఎడిటోరియల్రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాశిం సునీల్-- హర్షం వ్యక్తం చేసిన నెల్లూరు మోహన్ రెడ్డి

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాశిం సునీల్– హర్షం వ్యక్తం చేసిన నెల్లూరు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 15

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు అవకాశం కల్పించడంతో టీడీపీ నాయకులు,జిల్లా రైతు కార్యదర్శి హర్షం వ్యక్తం చేస్తూ సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ,పార్టీ కుటుంభ సభ్యులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,నిత్యం ప్రజా శ్రేయస్సు గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పార్టీలో కీలకమైన పదవిని నియమించడం సంతోషంగా ఉందన్నారు.కష్టపడి ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడిని,ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని అందుకు నిదర్శనమే ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పగించడం అని అన్నారు.సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన చంద్రబాబు నాయుడుకు,నారా లోకేష్ బాబుకు,అందుకు సహకరించిన మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular