ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్మానవత్వం పరిమళించిన వేళ బహుజన యూత్ ఫోర్స్ కొండంత అండ

మానవత్వం పరిమళించిన వేళ బహుజన యూత్ ఫోర్స్ కొండంత అండ

📰 Generate e-Paper Clip

🔵మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్న బహుజన యూత్ ఫోర్స్ 

🔵అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలతో నిరుపేదలకు అండగా నిలుస్తున్న బహుజన యూత్ ఫోర్స్

🔵ఆపదలో ఉన్న ప్రతి నిరు పేదకు అండగా బహుజన యూత్ ఫోర్స్

🔵మందా పెంచలయ్య కుటుంబానికి అండగా బహుజన యూత్ ఫోర్స్

🔵బహుజన యూత్ ఫోర్స్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు-మందా పెంచలయ్య కుటుంబం

కోట స్వర్ణసాగరం మే 17

ఇటీవల నూతనంగా స్థాపించబడిన బహుజన యూత్ ఫోర్స్ సంస్థ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వానికి ప్రతీకగా పేరు పొందుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన మందా పెంచలయ్య కుటుంబంలో ముగ్గురికి అనారోగ్య పరిస్థితులు బాగాలేక మంచానికే పరిమితం అయి పూట గడవక ఇబ్బందులు పడుతున్నారనే వార్తకు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఎట్టికేలకు స్పందించి దాతల సహకారంతో న్యాయవాది పి.వి.రమణయ్య బహుజన యూత్ ఫోర్సు గౌరవ సలహాదారులు ఐ.వి.రమణయ్య, దాసరి సుందరం చేతుల మీదుగా  ఆ కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరియు నిత్యవసర సరుకులు పండ్లను అందించి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సిద్దాంతాలతో బహుజన యూత్ ఫోర్స్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో నిరుపేదలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.మందా పెంచలయ్య కుటుంబానికి ఎవరైనా సహాయం చేయటానికి మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.అధికారులు,నాయకులు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.అనంతరం ఆపదలో ఆదుకున్న బహుజన యూత్ ఫోర్స్ నాయకులకు దాతలకు మంద పెంచలయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ బిన్ సువడుగల్ సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి,బహుజన యూత్ ఫోర్స్ నాయకులు శ్రీరామ్ శివప్రసాద్,పనబాక హేమంత్,దాసరి అశోక్ కాంబ్లే,దేవా బేకరీస్ అధినేత దేవా తుపిలి వినోద్,పల్లం రాజశేఖర్,తుపిలి రేవంత్, తుపిలి నిరంజన్,మీడియా మిత్రులు స్వరూప్,మునిరాజా,చెన్నకేశవులు,బహుజన యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular