ePaper
Friday, June 19, 2026
Homeఎడిటోరియల్మృతుని కుటుంబానికి  పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆర్ధిక సాయం

మృతుని కుటుంబానికి  పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆర్ధిక సాయం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూన్ 15

కోట మండలం,గూడలి గ్రామానికి చెందిన గుంటక వెంకటేశ్వర్లు కుటుంబాన్నికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అండగా నిలిచారు. పెళ్లకూరు జాతీయ రహదారి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటక వెంకటేశ్వర్లు మరణించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆ కుటుంబ యోగక్షేమాలు చూడాలని వెంకట కృష్ణారెడ్డిని సూచించారు.ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పెద్దకర్మ నిమిత్తం సోమవారం 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని మృతుని భార్య గౌరమ్మకు వెంకట కృష్ణారెడ్డి చేతులు మీదుగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పల్లె మల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్ధిక సాయాన్ని అందించామన్నారు.ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అండగా నిలుస్తున్నారని,అందులో భాగంగానే గూడలి గ్రామంలోని వెంకటేశ్వర్లు కుటుంబానికి ఎమ్మెల్యే సూచనల మేరకు నగదు అందించడం జరిగిందని వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular