ePaper
Wednesday, September 2, 2026
Homeవాకాడుముట్టింబాకలో మహా నేతకు వై ఎస్ ఆర్ కు ఘననివాళులు

ముట్టింబాకలో మహా నేతకు వై ఎస్ ఆర్ కు ఘననివాళులు

📰 Generate e-Paper Clip

ముఖ్యఅతిథిగా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డీ*

పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం*

*స్వర్ణసాగరం వాకాడు*

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వాకాడు మండల పరిధిలోని ముట్టింబాక గ్రామంలో మాజీ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జాలాభిషేఖం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలి పోతారని రైతులు,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన అమలు పధకాలు ద్వారా ఎంతో మంది జీవితాలు మారాయని ఫీజు రియంబస్ మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థుల భవిషత్ బంగారు భవిషత్ గా మారిందని తెలిపారు.ఆ మహానేత ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిన అంకితభావం పేద ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పులను గుర్తు చేసారు.

*వాకాడు ప్రజలు ఋణపడి ఉంటారు -కొడవలూరు దామోదర్ రెడ్డి 

ది విజన్ ఆఫ్ వైయస్సార్,ది డ్రీమ్ ఆఫ్ ఎన్ జె ఆర్ అనే పదాలకు నిలువుటద్దంగా స్వర్ణముఖి బ్యారేజ్ నిదర్శనమని ఈ తూర్పు తీర ప్రాంతాల రైతాంగానికి అతి పెద్ద వరమని దీని ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయని రుణమాఫీ ద్వారా రైతులకు భరోసా నింపారాని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అడ్డదిడ్డంగా మారాయిని వాటిని సరి చేయాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని ఆయన తెలిపారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు చేసిన మంచిని దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల్లో విజయం చేకూరేలా చూడాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైసీపీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు, జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ,వాకాడు మాజీ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి హిమ కుమార్ రెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, కోట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి,చిట్టమూరు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, లోక కళ్యాణ్ రెడ్డి, దువ్వూరు మధు రెడ్డి, నల్లారెడ్డి మధు రెడ్డి, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular