కోట స్వర్ణసాగరం జనవరి 15మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండల ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ నేత తిరుపతిజిల్లా రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి పండుగ మన సంస్కృతి,సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన అన్నారు.భోగి మంటలు, రంగవల్లులు,హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల ఆటలు,గాలిపటాల సందడి,పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను మరింతగా పెంచుతున్నాయని పేర్కొన్నారు.ఈ సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి,సుఖసంతోషాలు,ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండల ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ నేత తిరుపతిజిల్లా రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి పండుగ మన సంస్కృతి,సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన అన్నారు.భోగి మంటలు, రంగవల్లులు,హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల ఆటలు,గాలిపటాల సందడి,పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను మరింతగా పెంచుతున్నాయని పేర్కొన్నారు.ఈ సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి,సుఖసంతోషాలు,ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు.



