ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్నిరుపేదలకు అండగా గ్రీన్ ఫౌండేషన్ సేవలు అమోఘం.. కోట ఎస్సై పవన్ కుమార్

నిరుపేదలకు అండగా గ్రీన్ ఫౌండేషన్ సేవలు అమోఘం.. కోట ఎస్సై పవన్ కుమార్

📰 Generate e-Paper Clip

*కోట స్వర్ణసాగరం జనవరి 14*

నిరుపేదలకు అండగా నిలుస్తున్న గ్రీన్ ఫౌండేషన్ సేవలు అమోఘమని కోట ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు.కోట మండలం కోటలోని నార్త్ గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకొని బుధవారం గ్రీన్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోట ఎస్సై పవన్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా నిరుపేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోట ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘమని ఆయన పేర్కొన్నారు.ఎంతోమంది నిరుపేదలకు అభాగ్యులకు గ్రీన్ ఫౌండేషన్ నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వాకాడు ఏఎంసి  చైర్మన్ మర్రి ప్రమీల,కోట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు,ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షంషుద్దీన్,వార్డ్ మెంబర్ సుహాసిని,ఫౌండేషన్ సభ్యులు నౌషాద్,నాయబ్,అక్బర్ భాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular