ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్కాకువారిపాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన డైట్ లెక్చరర్ కోట శ్రీనివాసులు

కాకువారిపాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన డైట్ లెక్చరర్ కోట శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 26

చిల్లకూరు మండలం కాకువారిపాలెం ప్రాథమిక పాఠశాలను డైట్ లెక్చరర్ కోట శ్రీనివాసులు గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలలో 40 మంది విద్యార్ధులకు నిర్వహిస్తున్న ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంను టీచర్ కృష్ణవేణి ఒక్కరే అయినప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని జాదూపితారాను ఉపయోగించి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందిస్తున్నారని ప్రశంసించారు.తాను చదివిన పాఠశాలకి పరిశీలన అధికారిగా రావడం చాలా ఆనందంగా ఉందని తన తండ్రి అయిన కోట సుబ్రహ్మణ్యం పేరుతో చదువులో చురుకుగా ఉన్న విద్యార్థులందరికీ బహుమతులను ప్రధానం చేస్తూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular