కోట స్వర్ణసాగరం మార్చి 16
కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామం నందు 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కోట మండలం రైతు అధ్యక్షులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని గ్రామ ప్రజలు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు.వెంటనే స్పందించిన మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్డు పనులు ప్రారంభించారు.రోడ్డు పనులు ప్రారంభం కావడంతో
తిమ్మనాయుడుపాలెం గ్రామం ప్రజలు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈసందర్భంగా మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సహకారంతో వేగంగా రోడ్డు పనులు ప్రారంభం కావడం జరిగిందన్నారు.తిమ్మనాయుడుపాలెం గ్రామ పంచాయితీ అభివృద్ధి కోసం తాను ముందుంటానని ప్రజలు కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం,తొందర్లో మిగతా రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తిమ్మనాయుడుపాలెం పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తామని ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని గ్రామ అభివృద్ధి మా లక్ష్యం అని,మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం,గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేళ్ల గురునాథం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



