పదవి కాలం ముగించిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం
మనుబోలు, స్వర్ణసాగరం :
మాజీ మంత్రి జిల్లా వైకాపా అధ్యక్షులుకాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులులతో రెండు దాపాలు పంచాయితీ పరిపాలన చేసిన సర్పంచ్ వార్డు మెంబర్లకు వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సాయంత్రం పదవీకాలం ముగిసిన పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏప్రిల్ 2 తో పంచాయితీ పదవి కాలం ముగిస్తున్న సంగతి తెలిసిందే. సర్పంచ్ కంచి పద్మమ్మ రెండు దపాలు సర్పంచ్ గా బాధ్యతలు నెరవేర్పించి గ్రామంలో వివాదాల్లేకుండా మంచి పరిపాలన అందించారని కితాబునిచ్చారు. అలాగే వార్డు నెంబర్లు సైతం వివాదాలకు తావు లేకుండా పరిపాలన చేశారని అభినందించారు. అదే సమయంలో ఉప సర్పంచ్ కడువేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఐదు సంవత్సరాలు పదవి కాలంలో గ్రామంలో ఎంతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.మా ఆరాధ్య దైవం ప్రియతమ నాయకులు మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి ఎంతో నిధులు మంజూరు చేసి అనేక సిమెంట్ రోడ్లు సైడు కాలువలు అభివృద్ధి పనులు మంజూరు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని బతికున్నంత కాలం మర్చిపోలేము అని ఉపసర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి సభలో ప్రకటించారు. కేవలం ఆయన వల్లనే మనుబోలు పంచాయతీ అనేక అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.టౌన్ అధ్యక్షులు ముంగర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలపాటు వైకాపా ప్రభుత్వంలో పంచాయతీలో పరిపాలన చేసిన వార్డు మెంబర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ కు ధన్యవాదాలు చెప్పారు ఈ సమావేశంలో వైకాపా నేత బొమ్మిరెడ్డి మధు రెడ్డి.మాజీ జడ్పిటిసి దాసరి భాస్కర్ గౌడ్ వార్డు మెంబర్లు చల్లనవకోటి దాసరి మహేంద్ర వర్మ మాట్లాడారు. సర్పంచ్ కంచె పద్మమ్మ మాట్లాడుతూ పది సంవత్సరాలు నన్ను ఆదరించిన గ్రామస్తులకు వార్డ్ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్లు శాలువ కప్పి పూలమాలవేసి సన్మానం చేసి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీహరి సచివాలయ సెక్రెటరీ. వార్డు మెంబర్లు రాయి మంజుల. ఆదిలక్ష్మి. కుడుములవెంకట రమణయ్య.పి రమేష్ దాసరి మహేంద్ర వర్మ. పరిమళ ఆదిలక్ష్మి టి వెంకటేశ్వర్లు బి రేణుక చలగల దశయ్య చల్లా శ్రీనివాసులును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరి, వైకాపానేత దువ్వూరు సుధాకర్ రెడ్డి. దువ్వూరు సుబ్బారెడ్డి. బొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి. వెంకట రమణారెడ్డి.కంచి మణి పరిమళ బుజిగేంద్ర పరిమళ శివరాం. చప్పరం శేషయ్య. కాండ్ర నాగమణి. తుపాకుల గిరి.చల్లా నవకోటి. టైలర్ కిషోర్.మధు. తదితరులు పాల్గొన్నారు.



