ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్మేర్లపాకలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

మేర్లపాకలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

📰 Generate e-Paper Clip

  1. స్వర్ణసాగరం ఏర్పేడు మార్చ్ 29:-

 

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయితీ లో కేక్ రమణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కార్యక్రమంలో భాగంగా పార్టీ స్థాపకులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండలం అధ్యక్షుడు నాగరాజు నాయుడు మాట్లాడుతూ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిన చరిత్రను గుర్తు చేశారు. గ్రామీణ అభివృద్ధి, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం కోసం టీడీపీ చేసిన కృషి అమూల్యమని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉందని, ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు.అలాగే యువత పార్టీకి అండగా నిలవాలని, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలని అన్నారు.పార్టీకి విశ్వాసంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం లభిస్తుందని, కష్టపడే వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమం సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జెండా ఎగురవేతతో పాటు ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.ఈ వేడుకలో మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు, సీనియర్ నాయకులు పేరం ధనంజయ నాయుడు, నైనూరు పొన్నారావు,ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారీ గురువారెడ్డి, కేకే రమణ,రాఘవేంద్ర నాయుడు,మనోహర్ నాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, ముని రెడ్డి, గాలి కృష్ణవేణి, , వెంకటస్వామి,

ప్రసాద్, మురళి,వాసు, యువకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular