కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 6
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి గంగా ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ అజాత శత్రువు,అందరి బంధువు,మృథు స్వభావి,పేద వారికి ఎల్లప్పుడూ సహాయ,సహకారాలు అందించే మంచి మనసున్న గొప్ప వ్యక్తి కొండేపాటి గంగా ప్రసాద్ కు సకల దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎంతోమంది నిరుపేదలను ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి గంగా ప్రసాద్ అని,అలాంటి ప్రజా సేవకుడికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.



