ePaper
Wednesday, May 6, 2026
Homeఎడిటోరియల్తూపిలిలో 26 వ తేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ

తూపిలిలో 26 వ తేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 23

వాకాడు మండలం,తూపిలి గ్రామంలో ఏప్రిల్ 26 వ తేది ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత,మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుందని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు తెలిపారు.
గురువారం తూపిలి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సంబంధించిన ఏర్పాట్లపై
బహుజన యూత్ ఫోర్స్ మరియు తూపిలి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సభాధ్యక్షులు దారా బలరాం మాట్లాడుతూ తూపిలి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలవాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.కార్యక్రమాన్ని గౌరవప్రదంగా క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
ప్రతి గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ హాజరై ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని కోరారు. బహుజన యూత్ ఫోర్స్ అధ్యక్షుడు శ్రీరాం శివప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం విగ్రహావిష్కరణ కాకుండా,సామాజిక న్యాయం మరియు స్వాభిమానానికి ప్రతీక అని తెలిపారు.బౌద్ధులు,యువత,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బైక్ ర్యాలీలో యువత వందలాదిగా పాల్గొని తమ ఐక్యతను చాటాలని కోరారు.కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మరియు బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు.ముఖ్య అతిథిగా హాజరుకానున్న బైరి నరేష్ కు ఘన స్వాగతం పలకాలని తెలిపారు.ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ సోదరులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.బహుజన యూత్ ఫోర్స్ కో-కన్వీనర్ మరియు లీగల్ అడ్వైజర్ అశోక్ కాంబ్లే మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దళితులు,బౌద్ధుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని కొనియాడారు.
ఈ విగ్రహావిష్కరణ ద్వారా యువతలో చైతన్యం,సమానత్వం,విద్యా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు.వాకాడు,కోట, చిట్టమూరు,చిల్లకూరు మండలాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు.ప్రతి గ్రామం నుంచి భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా మార్చాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తూపిలి గ్రామస్తులు,బహుజన యూత్ ఫోర్స్ కో కన్వినర్స్ మీజూరు మురళీ కృష్ణ,జోరెపల్లి తేజ,దుంపల సురేంద్ర,పామంజి ప్రశాంత్, బి.వై.ఎఫ్ స్టూడెంట్ వింగ్ లీడర్స్ గౌతమ్, బి.వై.ఎఫ్ వాకాడు మండలం టీం పుచ్చలపల్లి కోటేష్,పుచ్చలపల్లి పవన్,స్టీవెన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular