ePaper
Tuesday, May 5, 2026
Homeఎడిటోరియల్*తూపిలి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ*

*తూపిలి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ*

📰 Generate e-Paper Clip

*ఆవిష్కరణకు బారిగా తరలివచిన బహుజనులు*

*వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నుండి బారి బైక్ ర్యాలీ*

*ముఖ్య అతిధిగా బైరి నరేష్*

*వాకాడు స్వర్ణసాగరం ఏప్రిల్ 26*

మండలంలోని తుపిలి గ్రామంలో ఆదివారం ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  బహుజనులు భారీగా తరలి వచ్చి వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నుండి బారి బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మూఢనమ్మకాల నిర్ములన సంఘం అధ్యక్షులు బైరి నరేష్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ అంబేద్కర్ అభ్యుదయ భావజాలం ప్రతి ఒక్కరిలో కలగాలని రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలోనూ, అణగారిన వర్గాల సామాజిక,ఆర్థిక సాధికారతకు దానిని ఒక శక్తివంతమైన సాధనంగా తీర్చిదిద్దడంలోనూ ఆయన చేసిన కృషి ఎనలేనిదని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవఅతిథిగా తూపిలి మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి,దారా బలరాం,కుంభాల శ్రీనివాసులు,షోడవరం సుధాకర్,దాసరి సుందరం,డాక్టర్ ఎం రామకృష్ణారావు,బి.వరప్రసాద్,కైలాసం కృష్ణ ప్రసాద్,పేర్నాటి వెంకటేశ్వర్లు,కృష్ణయ్య, రామకృష్ణ,డాక్టర్ రౌతు కన్నయ్య,గొంజి కృష్ణ,ఆనంద్,నవీన్,మాజీ ఎంపీటీసీ కడూరు భాస్కర్,కడూరు చెంగయ్య,కుంభాల బాబులు,తుగురు భాస్కర్,ఈదురు చెంచు కృష్ణ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు,తదితర దళిత సంఘాల నాయకులు,అంబేద్కర్ రిస్టులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular