ePaper
Thursday, June 4, 2026
Homeఎడిటోరియల్ప్రజా సేవకుడికి దక్కిన గౌరవం - టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి

ప్రజా సేవకుడికి దక్కిన గౌరవం – టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 16

ప్రజా సేవకుడు గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచి గౌరవం లభించిందని టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే నివాసంలో సునీల్ కుమార్ ను వెంకటకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి నాయకుడికి ప్రతీ కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని మంచి స్థానం లభిస్తుందని అందుకు నిదర్శనమే ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం అని అన్నారు.భవిష్యత్తులో సునీల్ కుమార్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.పాశిం సునీల్ కుమార్ మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్,ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular