కోట స్వర్ణసాగరం మే 31
కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గున్నంపాడియా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఉప్పల బాలకృష్ణ,కోట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు 33వ యూనిట్ ఇంచార్జ్ తిరుమూరు మురళి,తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనొక్, ఆదివారం పర్యటించారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం ఎన్ డి ఎ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పథకం ప్రజలకు అందుతున్నాయా లేదా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలుంటే మాకు తెలియపరిస్తే,ఆ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లి, ఆయన ఆధ్వర్యంలో ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలియపరిచారు. ఇదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు గురించి,ఎన్ డి ఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం,డాక్టర్ పాశం సునీల్ కుమార్ నేతృత్వంలో గూడూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తామని తిరుమూరు మురళి తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ కావాలి చిరంజీవి,గ్రామ నాయకులు నడవల సీనయ్య,నిమ్మల మురళి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



