ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్కోట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ

కోట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 26

కోట మండలం కోటలో మంగళవారం రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ముగ్గురు నిరుపేద కుటుంబాల వారికి 60 వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండల పరిధిలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన పల్లమాల వెంకటరత్నమ్మ కు నెల్లూరు మోహన్ రెడ్డి చేతులు మీదుగా,వంజీవక గ్రామానికి చెందిన సుబ్బమ్మ కు పసుపులేటి కిషోర్ చేతులు మీదుగా,వెంకన్నపాళెం గ్రామానికి చెందిన నాగేశ్వరి కు కోకర్ల మధు యాదవ్ చేతులు మీదుగా వారి పేదరికం ని దృష్టిలో పెట్టుకొని వారి జీవనానికి ఆధారంగా ఉండే సుమారు 60 వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్లు రోటరీ క్లబ్ సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఇప్పటికే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని,రాబోవు రోజులలో మరెన్నో సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్ ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్, సెక్రటరీ సుబ్రమణ్యం,సభ్యులు జమ్మి ప్రసాద్ నెల్లూరు మోహన్ రెడ్డి,మధు యాదవ్, పసుపులేటి కిషోర్,వంశీకృష్ణ,పోలిశెట్టి రవివర్మ,షేక్ షంషుద్దీన్,అద్దాల శివకుమార్, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular