🔷ఎస్సై నాగరాజును ఘనంగా సన్మానించిన బి వై ఎఫ్ నాయకులు
కోట స్వర్ణసాగరం మే 11
చిట్టమూరు మండల సబ్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు,సామాజిక న్యాయం కల్పించే మహత్తర గ్రంథమని పేర్కొంటూ రాజ్యాంగ గ్రంథాన్ని ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరణలో పెట్టాలని నాయకులు అభిప్రాయపడ్డారు.సమాజంలో యువత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,ఈ సందర్భంగా వారు తెలిపారు.ఎస్‌ఐ నాగరాజు బహుజన యూత్ ఫోర్స్ నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ సలహాదారులు ఐవీ రమణయ్య,దాసరి సుందరం,కర్లపూడి వెంకట రమణయ్య, కనుపూరు కృష్ణయ్య పాల్గొన్నారు.అలాగే బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివ ప్రసాద్,అన్ బిన్ సువడుగల్ సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి,న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లే,బీవైఎఫ్ కో-కన్వీనర్లు మీజూరు మురళి తదితరులు పాల్గొన్నారు.



