మనుబోలు, స్వర్ణసాగరం :
కాగితాలపూరు మైదానంలో నిర్వహించిన శశి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మనుబోలు యంజీసీటీ జట్టు ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్ ఎలెవన్ కాగితాలపూరు జట్టుతో జరిగిన తుది పోరులో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ టైటిల్‌ను కైవసం చేసుకుంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మనుబోలు యంజీసీటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. జట్టులో సతీష్ దూకుడుగా ఆడి 48 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అనంతరం 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫ్రెండ్స్ ఎలెవన్ కాగితాలపూరు జట్టు మనుబోలు బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 54 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మనుబోలు యంజీసీటీ జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.విజేతగా నిలిచిన మనుబోలు యంజీసీటీ జట్టుకు రూ.15 వేల నగదు బహుమతి అందజేయగా, రన్నరప్‌గా నిలిచిన ఫ్రెండ్స్ ఎలెవన్ కాగితాలపూరు జట్టుకు రూ.10 వేల బహుమతి ప్రదానం చేశారు. తృతీయ స్థానం దక్కించుకున్న పిడూరు జట్టుకు రూ.5 వేల నగదు బహుమతి అందించారు.శశి తల్లిదండ్రులు చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



