ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీ తాగనీటి సమస్యపై స్పందించిన కర్లపూడి రాంబాబు

సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీ తాగనీటి సమస్యపై స్పందించిన కర్లపూడి రాంబాబు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 6

కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీలో సుమారు 50 కుటుంబాల వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే గత నెల రోజుల నుండి ఆ గిరిజన కాలనీకి పంచాయతీ త్రాగునీరు రాక త్రాగడానికి,నిత్యవసరాలకు నీరు లేక విలవిలా అల్లాడిపోతున్నారు.ఈ నేపథ్యంలో కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కర్లపూడి రాంబాబు బుధవారం సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు మాట్లాడుతూ సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీలో నెల రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులకు ఎన్నిసార్లు తెలియపరిచిన స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీ నీటి సమస్యపై అధికారులు స్పందించకపోతే గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో తమ సొంత నిధులతో నూతన త్రాగునీటి బోరును ఏర్పాటుచేసి గిరిజన ప్రజల దాహార్తి తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular