ePaper
Wednesday, September 2, 2026
Homeఎడిటోరియల్విద్యార్థులు విలువలతో కూడిన విద్య క్రమశిక్షణ ను అలవాటు చేసుకోవాలి

విద్యార్థులు విలువలతో కూడిన విద్య క్రమశిక్షణ ను అలవాటు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

జూనియర్ సివిల్ జడ్జి కుమారి
మీనాక్షి సుందరి

కోట స్వర్ణసాగరం జనవరి 9*

విద్యార్థులు విలువలతో కూడిన విద్య క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కుమారి మీనాక్షి సుందరి
పేర్కొన్నారు.కోట మండలం విద్యానగర్ లోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జి కుమారి మీనాక్షి సుందరి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్జి కుమారి మీనాక్షి సుందరి కు కళాశాల యాజమాన్యం విద్యార్ధినీలు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జడ్జి కుమారి మీనాక్షి సుందరి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే విలువలతో కూడిన విద్యను మంచి నడవడికను అలవాటు చేసుకోవాలని,మత్తు పదార్థాలకు బానిసక కాకుండా మంచి లక్ష్యాన్ని అలవాటు చేసుకుని ఆ లక్ష్య సాధనపై దృష్టి పెట్టి ఉన్నతమైన శిఖరాలకు చేరుకుని,కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు,విద్యాబుద్ధులు,క్రమశిక్షణను నేర్పించే గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం వలన ప్రమాద సమయంలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య,న్యాయవాదులు వెంకటరమణ,అశోక్ కాంబ్లె,కోర్టు కానిస్టేబుల్ కోటి, న్యాయస్థానం సిబ్బంది,విద్యార్థులు కళాశాల సిబ్బంది,ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular