ePaper
Monday, June 15, 2026
Homeఎడిటోరియల్*ఘనంగా బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు*

*ఘనంగా బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు*

📰 Generate e-Paper Clip

*కోట స్వర్ణసాగరం జనవరి 8*

ప్రముఖ దళిత,బహుజన నాయకుడు,బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు గురువారం కోటలోని బహుజన ఐక్య వేదిక కార్యాలయంలో దళిత,బహుజన నాయుకులు మరియు బహుజన ఐక్య వేదిక కమిటీ బృందం సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు.ముందుగా మీజూరు మాధవ్ భారీ కేక్ కట్ చేయగా, నాయుకులు శాలువాలు కప్పి పూల మాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బహుజన ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ మీజూరు మాధవ్ చిన్న తనం అంబేద్కర్ బాటలో పయనించి దళిత,బహుజన ప్రజల కోసం హర్నిశలు పోరాటం చేశారని తెలిపారు.అంబేద్కర్ ధర్మ పోరాట సమితి,ఏ.ఎస్.పి.ఎస్,బహుజన సమాజ పార్టీలో పనిచేసి దళిత నేత గా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సి వర్గీకరణ చేపడితే మీజూరు మాధవ్ ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని బహటంగా చెప్పి ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి స్థాపించి అలుపెరుగనిపోరాటం చేశారని తెలిపారు.రాజ్యాధికారం కోసం బహుజన ఐక్య వేదిక స్థాపంచి ఎస్సి, ఎస్టీ,బిసి,మైనార్టీ ప్రజలను ఏకం చేసి కోటలో పెద్ద బహిరంగ సభ చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఇలాంటి గొప్ప బహుజన నాయకులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయుకులు మీజూరు మల్లి,పాల మల్లికార్జున్, పనబాక హేమంత్,మీజూరు మురళి కృష్ణ,భూపతి మొహన్ సాయి,కట్ట జనార్దన్,కుదురు కోటేశ్వరరావు, ఈదురు శ్రీనివాసులు,నవకోటి బాబు రావు,దార్ల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular