ePaper
Tuesday, April 14, 2026
Homeఆంధ్రప్రదేశ్దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం

దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం

📰 Generate e-Paper Clip

కారణి మిట్ట హరిజనవాడలో త్రాగునీటి కష్టాలకు చెక్…

తెలుగుదేశం పార్టీ చొరవతో, దగ్గరుండి పనులు చేపిస్తున్న మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు.

స్వర్ణసాగరం, బుచ్చినాయుడు కండ్రిగ :

మండల పరిధిలోని కారణి మిట్ట హరిజనవాడలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న త్రాగునీటి సమస్యకు తెలుగుదేశం పార్టీ చొరవతో శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. గ్రామ ప్రజలు తమ సమస్యను స్థానిక సర్పంచ్ కందేరి పద్మమ్మతో పాటు,  టీడీపీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు  దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై స్పందించిన కార్తీక్ నాయుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి, కొత్త త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు పనులను ప్రారంభింపజేయడమే కాకుండా, స్వయంగా స్థలానికి చేరుకుని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.సర్పంచ్ పద్మమ్మ అధ్యర్యంలో సాగుతున్న ఈ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ నాయకత్వ ప్రత్యేకత అని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరిజనవాడ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ చర్య, తెలుగుదేశం పార్టీ ప్రజా హితానికి అంకితభావంతో పనిచేస్తుందనే విషయానికి మరో నిదర్శనంగా నిలిచిందని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజల అవసరాలే దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయత్నం, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై మరింత విశ్వాసాన్ని పెంచుతోందని తెలుగుదేశం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మునికృష్ణమ నాయుడు, ఐటీడీపి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమార్, ఆయకట్టు ప్రెసిడెంట్ తండా రమణయ్య,వీరాస్వామి, పం డయ్య, సన్యాసయ్య, సురేష్, వెంకటేశ్వర చౌదరి, రాధారెడ్డి ఇంకా గ్రామస్తులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular