క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నాగమల్లి దుర్గాప్రసాద్
స్వర్ణసాగరం – శ్రీకాళహస్తి
స్వర్ణ సాగరం జాతీయ దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్, మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్ ఘనంగా ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణ సాగరం దినపత్రిక నిర్భయంగా నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని ప్రశంసించారు. ప్రజాసమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ దినపత్రిక, తక్కువ కాలంలోనే ప్రజల్లో విశ్వసనీయతను చాటుకుందని తెలిపారు. రాష్ట్రం, జిల్లా స్థాయి అంశాలతో పాటు సామాన్య ప్రజల గొంతుకగా నిలుస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో స్వర్ణసాగరం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజలకు చేరువై, సమాజానికి ఉపయోగపడే వార్తలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజ హితమే లక్ష్యంగా, నిస్పాక్షిక వార్తలతో పత్రిక ముందడుగు వేస్తుందని, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ స్వర్ణసాగరం ప్రయాణంలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.



