ePaper
Tuesday, April 14, 2026
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి

కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి

📰 Generate e-Paper Clip


* ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
* రూ.1.07కోట్ల విలువైన రోడ్లకు ప్రారంభోత్సవాలు

గుడిపాల స్వర్ణసాగరం:

కూటమి ప్రభుత్వం లోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. గుడిపాల మండలంలో రూ.1.07 కోట్లతో చేపట్టిన సిమెంట్ రోడ్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే  స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.  మొదటగా 189 కొత్తపల్లి నుండి ఎస్టీ కాలనీ వరకు రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును పేయనపల్లి రైల్వే ట్రాక్ నుండి పేయనపల్లి హరిజన వాడకు రూ.24 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును సీఎం కండిగ నుండి తమిళనాడు సరిహద్దు లెప్రసీ కాలనీ వరకు రూ.58 లక్షలతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని గుర్తించామని స్థానికుల వినతి మేరకు సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని నిరంతరం తపిస్తుందన్నారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రోడ్లు లైట్లు నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు  గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు మాజీ ఎమ్మెల్యే గాంధీ, మాజీ జెడ్పిటిసి సభ్యులు బాలాజీ నాయుడు  సుమతి సింగల్ విండో చైర్మన్ ప్రతాప్ నాయుడు  తెదేపా ఉపాధ్యక్షులు ధనసింగ్ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం యాదవ్ నాయకులు అనిల్ సంగీత  గోపి హరి భాజాపా మండలం అధ్యక్షులు రమాదేవి  తాసిల్దార్ శ్రీనివాసులు పంచాయతీరాజ్ ప్రసాద్ నాయుడు ఇతర అధికారులు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular