తంగేళ్లపాలెంలో నిర్వాహకుల అరెస్ట్,

స్వర్ణసాగరం – తొట్టంబేడు,
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలో అనధికారికంగా నిర్వహిస్తున్న కోడి పందెం స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే నమ్మకమైన సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ దాడుల్లో కోడి పందెం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోళ్లు, రూ.1,500 నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి తొట్టంబేడు మరియు బుచ్చినాయుడు కండ్రిగ పోలీస్ స్టేషన్ సీఐ తిమ్మయ్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా కోడి పందాలు లేదా జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.



