ePaper
Saturday, June 13, 2026
Homeఎడిటోరియల్కోటలో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ

కోటలో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 26

కోట మండలం కోటలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సోమవారం నందమూరి ఫ్యాన్స్ పంట్రరంగం చంటి,మీజురు మధు బాబు,మీజురు రవి, ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన,మర్రి పోలయ్య,రాయపు పోలయ్య,మర్రి అనిల్,తిరుమల పాల డైరీ,శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా బానసంచా వేడుకలతో జై ఎన్టీఆర్ నినాదాలతో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నందమూరి అభిమానులు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని నందమూరి వంశంలో జన్మించి తాతగారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నేడు టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారన్నారు.తన అద్భుతమైన నటన,డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు.ఆయన రాబోయే సినిమాల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాకం వినోద్,రాయపు రాకేష్,బందిలి బాబు,రూపేష్,పవన్,కోటి,శశి,ప్రశాంత్, సిసింద్రీ,శ్రావణ్ కుమార్,చక్రి,శ్రీకాంత్,వెంకటేష్, గురవయ్య,మదన్,సాయి,సమర,రాజా,సన్నీ, మధు,కోటి,శ్రీను,వెంకటరమణయ్య,మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular