ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్రాజ్యాంగ వివులను కాపాడుకోవడమే నిజమైన గణతంత్ర దినోత్సవం..చాపల శ్రీనివాసులు

రాజ్యాంగ వివులను కాపాడుకోవడమే నిజమైన గణతంత్ర దినోత్సవం..చాపల శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 26

రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే నిజమైన గణతంత్ర దినోత్సవం అని టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు పేర్కొన్నారు.కోట మండలం కేశవరం సచివాలయం మరియు చిట్టేడు పి.ఎ.సి.ఎస్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం టీడీపీ నేత,చిట్టేడు పిఎసిఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జెండా వందనం చేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చాపల శ్రీనివాసులు మాట్లాడుతూ అందరూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి బాటలో నడవాలని అన్నారు.భారత రాజ్యాంగం దేశ పౌరులకు అందించిన స్వేచ్ఛ సమానత్వం న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహానుభావుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని,రాజ్యాంగ హక్కులను విలువలను కాపాడుకోవడమే నిజమైన గణతంత్ర దినోత్సవం అని అన్నారు.
 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular