ePaper
Friday, June 19, 2026
Homeఎడిటోరియల్మహాత్మునికి ఘన నివాళులు అర్పించిన కోట తెదేపా నాయకులు

మహాత్మునికి ఘన నివాళులు అర్పించిన కోట తెదేపా నాయకులు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 30

స్వాతంత్ర పోరాట యోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోటలో శుక్రవారం కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట మండలం తెలుగుదేశం పార్టీ  ప్రధాని కార్యదర్శి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు కోట పట్టణంలోని మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి మహాత్మా గాంధీ కి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ అహింసను ఆయుధంగా,సత్యాన్ని మార్గంగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు.మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూటమి ప్రభుత్వం తమ పరిపాలన ద్వారా నెరవేరుస్తుందని అన్నారు. శాంతి అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన భారత జాతి పితామహుడు మహాత్మా గాంధీ సేవలు తరతరాలకు ఆదర్శం అని కోటేశ్వరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో కోట మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మీజురు మధు బాబు,సోషల్ మీడియా ప్రధాని కార్యదర్శి ఏంబేటి రూపేష్, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు పునమల్లి నీలేష్,సోషల్ మీడియా కార్యదర్శి పంట్రరంగం చంటి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular