కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 14
శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోట మండలం వీరారెడ్డిసత్రం వద్ద శనివారం ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం నిర్యహించారు.ఉదయం పుంగనూరు జాతి కి చెందిన గేదెకు శాస్త్రవేత్తంగా పూజలు నిర్వహించి ఎడ్ల పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలలో కోట,వాకాడు,చిట్టమూరు,చిలుకూరు,గూడూరు మండలాల నుంచి 15 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి.నిర్వాహకులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయి.ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలలో మల్లు భాస్కర్ రెడ్డికి ప్రథమ బహుమతిగా 30000 వేల రూపాయలు,కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చేతులు మీదుగా అందజేశారు.రెండవ బహుమతి వాకాడు మండలం బాలి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎంబేటి రమణయ్య 20 వేల రూపాయలు నగదు బహుమతి గెలుపొందారు.అదేవిధంగా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన వారికి మూడవ బహుమతి పదివేల రూపాయలు,నాలుగో బహుమతి కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రమతి వెంకట కృష్ణయ్య ఐదు వేల రూపాయలు బహుమతి ని కోట ఎస్సై పవన్ కుమార్ చేతులమీదుగాఅందజేయడం జరిగినది.ఈ పోటీలకు ముఖ్య అ తిధులుగా కోట మండలం, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్,వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ కొకర్ల మధు యాదవ్,కోట వాకాడు చిట్టమూరు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎద్దుల పందేలను వీక్షించారు.



