– బతుకమ్మ చెరువు సుందరీకరణ
– అభివృద్ధి దిశగా అడుగులు
– అర్ధ రాత్రయిన పారిశుధ్య పనులు వేగవంతం
– స్థానికుల హర్షం
స్వర్ణ సాగరం మార్చ్ 29డోర్నకల్:
పట్టణ అభివృద్ధి మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నచందంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల నిధులను మంజూరు జరిపించారు. ప్రతి వార్డుకు కోటి రూపాయలతో బీసీ రోడ్లు,మురికి కాలువలు, పారిశుధ్య నిర్వహణకు వెచ్చించి ఆ దిశగా పనులు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రెండు కోట్ల వ్యయంతో బతుకమ్మ చెరువు సుందరీకరణ,మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం పురపాలక చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్ బాబు,వైస్ చైర్ పర్సన్ మాద లావణ్య శ్రీనివాస్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏండ్ల తరబడి వెనుకబడిన పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మినీ ట్యాంకుబండ్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణన్ని అందిస్తుందని అన్నారు. వాకింగ్ ట్రాక్,విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మను ఉన్నట్లు తెలిపారు.అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్ స్థానికులతో కలిసి మురికి కాలువలు శుభ్రం చేశారు. దీంతో పాలనలో ప్రత్యేక మార్కు చూపుతున్నారని ప్రజలు హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్లు గారే రమేష్ తదితరులున్నారు.



