ePaper
Monday, June 15, 2026
Homeఎడిటోరియల్కోటలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయిని కే.రమాదేవి పదవి విరమణ సన్మాన సభ

కోటలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయిని కే.రమాదేవి పదవి విరమణ సన్మాన సభ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 31

కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కే.రమాదేవి సోమవారం పదవి విరమణ పొందారు.ఈ నేపథ్యంలో సోమవారం ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో రమాదేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయుని రమాదేవి పాదాలకు పాద పూజ చేసి వారి రుణం తీసుకున్నారు. అనంతరం రమాదేవి తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ సిబ్బంది జ్యోతిని వెలిగించి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రమాదేవి తమ వృత్తిలో ఎంతో నిబద్దతతో పనిచేసి మంచి క్రమశిక్షణ నడవడికతో కూడిన విద్యను విద్యార్థులకు అందించి ఎందరో పేద విద్యార్థులను విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత రమాదేవికి ఉందన్నారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ ముందుగా తమకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనాలు తెలిపారు. పేదరికంను నిర్మూలించే ఏకైక ఆయుధం విద్య ఒకటేనని విద్యకు వెలగట్టగలిగినది ఏమీ లేదని విద్యతో ఎంతటి కటిక పేదరికాన్ని అయిన జయించి మంచి స్థాయికి చేరుకోవచ్చు అని విద్యార్థిని విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చారు.విద్యార్థులతో తమకున్న అనుబంధాన్ని ఎన్ని కోట్లు పెట్టిన కొనలేమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular