కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 24
సంగం డైరీ ఛైర్మన్,గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు తూపిలి రాధాకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామిక మండలిలో సంగం డైరీ నూతన ప్లాంట్ కి ఛైర్మన్ ధూళిపాల నరేంద్ర ద్వారా జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనమని సంగండైరీ ప్రతినిధి ద్వారా అందిన ఆహ్వానం మేరకు రాధాకృష్ణారెడ్డి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.సంగం డైరీ ఛైర్మన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ధూళిపాల నరేంద్ర తూపిలి రాధాకృష్ణారెడ్డితో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరత్న మామ కోట గ్రామస్తుడు, రాధాకృష్ణారెడ్డి సోదరుడు,తూపిలి మధుసూధన రెడ్డి తో తనకు తన తండ్రి మాజీ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి కి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గురించి, తారకరత్న పిల్లల గురించి రాధాకృష్ణారెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.



