*కోట పరిధిలో త్వరలో పలుచోట్ల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం*
*రోటరీ క్లబ్ సేవలను విస్తృతం చేస్తాం-రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్*
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 26
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోట మండలం కోటలోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని ఎస్.కే.బి చికెన్ మార్కెట్ వద్ద ఆదివారం త్రాగునీటి చలివేంద్రంను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.మొదటిరోజు చలివేంద్రం ప్రారంభం సందర్భంగా వాహనదారులకు పాదచారులకు ప్రజలకు చల్లటి మజ్జిగను అందించారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు.వేసవి కాలం దృష్ట్యా ప్రస్తుతం ఎండలు ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజల సౌకర్యార్థం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో మొదటి చలివేంద్రం ను ప్రారంభించడం జగిందని,మరో రెండు మూడు రోజులలో కోటలోని శ్యామసుందరపురం మెయిన్ రోడ్డు,క్రాస్ రోడ్డు వద్ద మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అదేవిదంగా రోటరీ క్లబ్ సేవలను పలు సేవా కార్యక్రమాలతో విస్తృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్,సెక్రటరీ సుబ్రహ్మణ్యం,మాజీ ప్రెసిడెంట్ జమ్మి ప్రసాద్,పసుపులేటి కిషోర్,సభ్యులు శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



