ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు కొండంత అండ-పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు కొండంత అండ-పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి 

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూన్ 1

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీలో నివాసం ఉంటున్న తేరూరు రాంబాబు అనే వ్యక్తి కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వం అందిస్తున్నది.అయితే రాంబాబు అనారోగ్యంతో మరణించారు.అయితే కొంతకాలం క్రితం తేరూరు రాంబాబు మరణించడంతో అతని భార్య జయంతి నిస్సహాయురాలుగా మారింది.ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి ఆ నిరుపేదరాలు జయంతి బాధను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలియజేసి తన భర్త చనిపోయిన కారణంగా ఆయనకు వస్తున్న పెన్షన్ను అతని భార్య జయంతి కి వచ్చేలా చూడాలని కోరారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ జయంతికి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా జయంతికి స్పౌజ్ పెన్షన్ అందించారు.ఈ సందర్భంగా తేరూరు జయంతి మాట్లాడుతూ తన భర్త చనిపోయిన తర్వాత ఆయనకు వస్తున్న పెన్షన్ను తమకు మంజూరు చేయించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి అందుకు సహకరించిన స్థానిక టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.జీవితాంతం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వెంకటకృష్ణారెడ్డికి రుణపడి ఉంటాను అని ఆమె ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో సాలూరు గోపాలయ్య,కోట ధనంజయ, డిజిటల్ అసిస్టెంట్ నారాయణ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular